ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 98.44%

mlc elctionరాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో నిర్వహించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది.  మొత్తం నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు రంగారెడ్డి జిల్లాలో 2, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా 12 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడగా ఇప్పటికే ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తంగా 98.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

స్థానాల వారీగా పోలింగ్ శాతం

రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 99.7 శాతం పోలింగ్ నమోదైంది. 771 మంది ఓటర్లు ఉన్నారు. 769 మంది ఓటర్లు ఓటు వేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ 99.7 శాతం నమోదైంది.  రెండు స్థానాల్లో 1,260 ఓట్లకు …1257 ఓట్లు పోలయ్యాయి.

నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. నమోదైన పోలింగ్ శాతం 99. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 1,110 ఓటర్లు ఉన్నారు. 1,100 మంది ఓటర్లు ఓటు వేశారు.

ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీలోకి దిగారు. జిల్లాలో 95.72 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 726 మంది ఓటర్లుండగా… 692 మంది ఓటర్లు ఓటు వేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy