కృష్ణా రివర్ బోర్డు సమావేశం : ఇరు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

krishna meetతెలుగు రాష్ట్రాల్లో నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, టెలిమెట్రిల ఏర్పాటు, నీటి వినియోగం, వాటాలపై వాడి వేడి చర్చ జరిగింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌథలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. బుధవారం (జూన్-6)  బోర్డు చైర్మన్ HK  సాహూ అధ్యక్షతన జరిగిన భేటీకి రాష్ట్ర ప్రభుత్వ CS SK జోషితో పాటు ఇరిగేషన్ అధికారులు అటెండయ్యారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంపై సమావేశంలో చర్చించారు.  కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపు, టెలిమెట్రీల ఏర్పాటు,  వాటాలపై ప్రధానంగా రెండు రాష్ట్రాల ప్రతినిధులు వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.  2018–19 ఏడాదికిగాను కృష్ణా జలాల్లో తమకు 33 శాతం కాకుండా 50 శాతం నీటి వాటా కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో కృష్ణాబోర్డు ఎవరి వాదనకు మొగ్గు చూపుతుంది, ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

సమావేశంలో కృష్ణా బోర్డు మొత్తంగా 13 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. ఇందులో బోర్డుకు సిబ్బంది, నిధుల కేటాయింపు, వర్కింగ్‌ మాన్యువల్‌ ఆమోదం, మొదటి, రెండో దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు, తాగునీటికి కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి తక్కువగా ఉండటంపై ఏర్పాటు చేసిన కమిటీలిచ్చిన నివేదికలు, 2017–18లో నీటి వినియోగం, 2018–19లో నీరు, విద్యుత్‌ పంపిణీ తదితర అంశాలను వెల్లడించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy