ముగిసిన జాదవ్ అంత్యక్రియలు

jadavతెలంగాణ ఉద్యమకారుడు, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. అంబర్ పేటలోని స్మశానవాటికలో ఆయన మూడో కూతురు నివేదిత… అంత్యక్రియలు నిర్వహించారు. డీడీ కాలనీలోని తన ఇంటి నుంచి సాగిన అంతిమయ యాత్రలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కడసారిగా నివాళులర్పించారు. శ్వాసకోస వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన.. ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1933 జనవరి 27న జన్మించిన జాదవ్… మొదటి నుంచి తెలంగాణ హక్కుల కోసం పోరాడారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. జాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. జాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నేతలు, ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. తెలంగాణ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు పలువురు ప్రముఖులు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. గొప్ప పోరాట యోధుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలోనూ జైలు జీవితం గడిపారని గుర్తుకు చేశారు. మలి దశ, తొలి దశ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు ప్రముఖులు. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే తన స్వప్నంగా జీవించారన్నారు. ఆయన ఆశయలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy