ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్

DROUGHT-22_jpg_745fనిరాశలో అన్నదాతలు

నైరుతి రుతుపవనాల సీజన్ ఇవాళ్టితో కంప్లీట్ అయింది. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఆనందాన్ని ..చాలా ప్రాంతాల్లో వేదనను మిగిల్చి  వెళ్లిపోయాయి రుతుపవనాలు.  రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. రుతుపవనాల రాకతో  జూన్ లో వర్షాలు బాగానే పడినా..జూలై, ఆగస్టులో పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడలేదు. అయితే ఆగస్టు చివరి వారంతో పాటు సెప్టెంబర్ లో వర్షాలు పర్వాలేదనిపించాయి. రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. జూలై, ఆగస్టు నెలలే వ్యవసాయానికి కీలకం కాగా..ఈ రెండు నెలలు వర్షాలు తీవ్ర నిరాశపరిచాయి. ఈ నెలల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ మినహా మిగతా జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెదక్ లో 51, నిజామాబాద్ లో 49, హైదరాబాద్ లో 43, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో 41, ఆదిలాబాద్ లో 20, కరీంనగర్ జిల్లాలో 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

India Monsoon Worryరుతుపవనాలు ఈసారి రాయలసీమపై కరుణ చూపించాయి. జూన్ లో ఒక మోస్తారు వర్షాలు కురిసినా తర్వాత రెండు నెలల్లో వర్షాభావంతో కరువు పరిస్థితి నెలకొని తాగునీటికీ కొరత ఏర్పడింది. సీజన్ ముగిసేసరికి సాధారణం కన్నా 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  ఇక కోస్తాలో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టులో వర్షాభావం నెలకొన్నా..అప్పుడప్పుడు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది పసిపిక్ మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావం ఏర్పడిందని  ఎక్స్ పర్ట్స్ విశ్లేషించారు. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. సగం మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy