ముగిసిన వర్షాకాల సమావేశాలు…ట్రిపుల్ తలాఖ్ కు మళ్లీ బ్రేక్

పార్లమెంట్  సమావేశాల్లో  చివరి రోజున..  రాఫెల్  డీల్ తో  రచ్చ  క్రియేట్  అయ్యింది. రాజ్యసభ లో మాటలయుద్ధం  నడిచింది. రాఫెల్ డీల్ పై  చర్చకు  కాంగ్రెస్  పట్టుపట్టడం  గందరగోళానికి  దారి తీసింది.  ఆ తర్వాత  సభ కాస్త  కూల్ గానే  నడిచింది.  అటు  లోక్ సభ  కూడా  కూల్ గా  కొనసాగింది.  నిరవధికంగా వాయిదా పడింది.

గత నెల 18న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఇక.. ఉదయం రాజ్యసభలో గందరగోళపరిస్థితి ఏర్పడింది. రాఫెల్ డీల్ పై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు ఉప విపక్ష నేత ఆనంద్ శర్మ. దీనికి డిప్యూటీ చైర్మన్ అంగీకరించలేదు. ఇదే టైంలో కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయల్. అవినీతితో కూరుకుపోయిన కాంగ్రెస్.. తమపై ఆరోపణలు చేస్తోందన్నారు.

రాఫెల్ డీల్ పై సంయుక్త పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్ష నేత ఆజాద్ డిమాండ్ చేశారు. అపోజిషన్ కు వేరే అవకాశం లేదు కాబట్టే సభలో ప్రస్తావిస్తున్నామన్నారు. జవాబు చెప్పాల్సిందిపోయి ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. దీనిపై మరోసారి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మొదలవ్వడంతో సభను కాసేపు వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్. వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. దీంతో సభ మళ్లీ వాయిదా పడింది.

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఈ  సెషన్ లో కూడా బ్రేక్ పడింది. ఈ సెషన్ లో బిల్లు ప్రవేశపెట్టడం లేదని చెప్పారు వెంకయ్యనాయుడు. ఇవాల్టి షెడ్యూల్ లో ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఉన్నప్పటికీ.. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పక్కనపెట్టినట్టు చెప్పారు వెంకయ్య.

బ్యాంకుల దివాలాకోరు చట్టసవరణ బిల్లు, కమర్షియల్ కోర్టులు, డివిజన్, అప్పీలేట్ డివిజన్ హైకోర్టుల చట్టసవరణ బిల్లులు రాజ్యసభలో పాసయ్యాయి. అలాగే.. దేశమంతటా ఒకే రిజర్వేషన్ విధానం అమలుకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు, భర్తలను కోల్పోయిన స్త్రీల సమస్యలపై  సభలో చర్చ జరిగింది. తర్వాత సభ నిరవధికంగా వాయిదాపడింది.

ఇక.. న్యాయస్థానానికి బయట మధ్యవర్తిత్వం, రాజీకి సంబంధించిన చట్టసవరణ బిల్లు లోక్ సభలో పాసైంది. బిల్లుపై చర్చ తర్వాత లోక్ సభ నిరవధికంగా వాయిదాపడింది. రాఫెల్ డీల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని.. పార్లమెంట్ ముందు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy