ముగిసిన శివకుమార స్వామి అంత్యక్రియలు

ఆధునిక బసవణ్ణ, నడిచే దేవుడుగా ఖ్యాతి గడించిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మఠంలోనే వీరశైవ లింగాయత్‌ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగిశాయి. స్వామి మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌  కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు.

కర్ణాటకలోని తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి 111 ఏళ్ల శివకుమార స్వామీజీ సోమవారం ఉదయం అస్తమించారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శివకుమారస్వామి శివైక్యంతో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోని అశేష భక్తజనం శోకసంద్రంలో మునిగిపోయారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో సహా పెద్దసంఖ్యలో మంత్రులు, శాసనసభ్యులు, ప్రముఖులు తుమకూరు మఠానికి తరలివచ్చారు. వేలాది మంది భక్తులు స్వామీజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy