ముగ్గుర్ని మర్డర్ చేసిన ఎడిటర్

ఓ త్రిపుర సీనియర్ జర్నలిస్టు మూడు మర్డర్లు చేశాడు.తన దగ్గర పని చేసే ముగ్గురు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.  సుశీల్ చౌధరి అనే ఈ జర్నలిస్టు….త్రిపురలో ‘దైనిక్ గందూట్’ అనే న్యూస్ పేపర్ కి ఓనర్ కమ్ ఎడిటర్. వయసు తక్కువేమీ కాదు, 76 ఏళ్ళు. తన ఆఫీసులో పని చేస్తున్న ఓ మేనేజర్ ను, ఓ ప్రూఫ్ రీడర్ ను, ఓ  డ్రైవర్ ను దారుణంగా మర్డర్ చేసినట్లు కోర్టులో రుజువైంది. కాటికి కాళ్లు చాచుకున్న ముసలాడికి , అందులోనూ సొసైటీలో ఎంతో పేరున్న ఎడిటర్ కు ఇట్లా మర్డర్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని  ఆరా తీస్తే భూతగాదాలే అందుకు కారణమని తేలింది.

బయటినుంచి వచ్చిన గూండాలెవరో ఆ ముగ్గుర్ని చంపినట్లు సుశీల్ చౌధరి మొదట డ్రామాలాడినా  పోలీసుల స్టయిల్ లో ఇంటరాగేట్ చేసేసరికి నేరం ఒప్పుకోక తప్పలేదు. ముగ్గుర్ని చంపినందుకు చౌధరికి ఉరిశిక్ష గానీ జీవితఖైదు కానీ పడే అవకాశం ఉంది. ఏ శిక్ష వేసేది గురువారం తెలుస్తుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy