ముచ్చటగా మూడోసారి…

bjhkhjబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా యాక్ట్ చేసిన దబాంగ్-1,2 సినిమాలు  మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు దబాంగ్-3 చేసేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడు. సల్మాన్ సరసన దబాంగ్-1,2 లోనూ సోనాక్షి  సిన్హా యాక్ట్ చేసింది. అయితే దబాంగ్-3 లో మాత్రం ఆమె యాక్ట్ చేస్తుందా, చేయదా అనే విషయమై గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ కి ఆమెకు విభేదాలు వచ్చాయని దీంతో ఆమె స్థానంలో పరిణితీ చోప్రాను తీసుకోవాలని అనుకున్నారని టాక్ నడిచింది. అయితే ఈ ఉహాగానాలకు తెరదించుతూ దబాంగ్-3 లోనూ సోనాక్షినే నటిస్తుందని సల్మాన్‌ సోదరుడు ప్రొడ్యూసర్  అర్బాజ్‌ ఖాన్‌ తెలిపారు. ఇక సోనాక్షితో పాటు మరో హీరోయిన్ కూడా  ఈ సినిమాలో యాక్ట్ చేయనుందని తెలుస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy