మునుపెరుగని ఒమేగా 3 ఆమ్ల అద్భుత ఫలితాలు

omఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేసేవని ఇప్పటికే బాగా తెలుసు, కానీ అవి ఆరోగ్యం పై చూపించే ప్రభావం మునుపు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా, ఉత్తమంగా ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా 3 ఆమ్లాలలో DHA రకం, EPA రకం కన్నా మరింత మంచి ప్రభావాన్ని చూపిస్తుందని కూడా ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ వారు చెబుతున్నారు. ఈ కొవ్వు ఆమ్లాలు మాంసాహారం, గుడ్లలో తక్కువస్థాయిలో, తల్లి పాలలో కాస్త ఎక్కువగా, సముద్రపు నూనె చేపలైన సాల్మన్, ట్యూనా, మాకేరెల్ రకం చేపలలో అత్యదికంగా లభిస్తాయి. 2 నుండి 4 గ్రాముల లోపల టాబ్లెట్ల రూపంలో తీసుకున్నప్పుడు కూడా DHA రకం ఒమేగా 3 ఆమ్లం మెదడు, కళ్ళు, కాలేయం, రక్తం, గుండె ల పనితీరు పై మంచి ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో తెలిసింది. DHA పిల్లల తెలివితేటల్లో వృద్ది ఉండటమే కాక వృద్ధుల జ్ఞాపక శక్తి నిలవడంలో కూడా గొప్ప పాత్ర పోషిస్తుందని వీరు చెబుతున్నారు.

పాశ్చాత్య ఆహారపు అలవాట్ల వల్ల కాలేయానికి వచ్చే ఇబ్బందులను నివారించడం కూడా ఈ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల జరుగుతున్నట్లు గమనించారు. సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యలను DHA బాగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలినట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy