ముప్పు తప్పింది : సముద్రంలో కూలిన చైనా స్కైలాబ్

tiaఅంతరిక్షంలో తప్పిపోయిన చైనా టియాన్ గంగ్-1 స్పేస్ స్టేషన్ పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. ఆదివారం(ఏప్రిల్1) అర్ధరాత్రి 12.15 గంటలకు టియాన్ గంగ్-1 కాలిపోతూ భూ వాతావరణంలోకి ప్రవేశించి… దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో కూలిపోయినట్లు చైనీస్ మీడియా తెలిపింది.
చైనా 2011లో టియాన్ గంగ్‌-1 స్పేస్‌ స్టేష న్‌ ను చైనా 2011లో ప్రయోగించింది. అయితే 2016లో ఇది పనిచేయడం మానేసి కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవు ఉండే టియాన్ గంగ్‌-1 న్యూయార్క్, బీజింగ్, వంటి పెద్ద నగరాల్లో ఇది కూలే అవకాశముందని శాస్త్రవేత్తలు ఊహించారు. ఎక్కడ పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ సమయంలో అది సముద్రంలో కూలిపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy