ములాయం vs మోడీ

M_Id_449847_Modiమీ చేయి అమాయకుల రక్తంతో తడిసింది…. మీ ప్రభుత్వం ప్రజలను నాశనం చేసింది. ఇది సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీల మధ్య మాటల యుద్ధం. దీనికి ఉత్తర ప్రదేశ్ వేదికైంది. వారణాసిలో జరిగిన సభలో ములాయం…గోరఖ్ పూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలు ఊపందుకోవడంతో ఎన్నికల ముందు ట్రయల్ ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్న నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి ఇప్పటికే టూర్లేస్తుండగా… తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం కూడా సీన్లోకి ఎంటరయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన వేర్వేరు బహిరంగ సభల్లో పాల్గొన్న ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని పొలిటికల్ హీట్ పెంచారు. మోడీ పై ములాయం తీవ్రమైన ఆరోపణలతో విరుచుకు పడ్డారు. మోడీ చేతులు రక్తంతో తడిశాయంటూ విమర్శలు గుప్పించారు. గుజరాత్ లో జరిగిన అల్లర్లను అరికట్టడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. కుల రాజకీయాలకు తమ పార్టీ దూరమని.. యూపీలో సమాజ్ వాదీ ఉత్తమ పాలన అందిస్తోందన్నారు. మరోవైపు యూపీ గోరఖ్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ.. తనదైన శైలిలో ములాయంపై విమర్శలు సంధించారు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధికి  చాలా అవకాశముందని…ములాయం అండ్ కో యూపీనీ ఎదగనివ్వరని ఆరోపించారు.  యూపీనీ మరో గుజరాత్  కానివ్వనంటూ ములాయం నిజమే చెప్పారని.. ఎస్పీ అధికారంలో ఉన్నంత వరకు అది జరగని పనంటూ తనపై ములాయం చేసిన విమర్శలను  తిప్పికొట్టారుమోడీ. తనకు 60 నెలల టైం ఇస్తే సామాన్య ప్రజల జీవితాలను మార్చేస్తానంటూ హామీ ఇచ్చారు మోడీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy