
ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. మైనార్టీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీపై 2 లక్షల ఆర్ధిక సాయం అందించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మైనార్టీలకు కనీసం 10 శాతం కోటా ఉండాలని ఆదేశించారు. కోకాపేటలో 10 ఎకరాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు వారాల్లోగా ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు.
రాష్ట్ర సర్కార్ పరిధిలోని పోటీ పరీక్షలు.. ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఉర్దూ బాషలో కూడా నిర్వహించాలన్నారు సీఎం. దేశంలో చార్మినార్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సీఎం… అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
మైనార్టీ సమీక్షలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ… సర్కార్ రెసిడెన్షియల్ స్కూల్స్ సామాజిక మార్పుకు ఉపయోగపడుతున్నాయన్నారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.