మూకుమ్మడి హింస నియంత్రణ బిల్లు : మణిపూర్ క్యాబినెట్ ఆమోదం

దేశంలో పెరిగిపోతున్న గుంపు దాడులకు బ్రేక్ వేసేందుకు ముందుకొచ్చింది మణిపూర్ సర్కార్. అడ్డూ అదుపూ లేకుండా మూకుమ్మడి దాడులు పెరిగిపోతున్నాయని, దీనిని నియంత్రించవలసిన అవసరముందని భావించిన సర్కార్… మూకుమ్మడి హింస నియంత్రణ(యాంటీ-మాబ్ వైలెన్స్) బిల్లును తీసుకొచ్చింది. బుధవారం(సెప్టెంబర్-19) ఈ బిల్లుకు మణిపూర్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయో శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

చట్టపరమైన విచారణకు అవకాశం లేకుండా ఏవో కారణాలతో మనుషుల్ని కొట్టిచంపే ఘటనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మణిపూర్‌ లో కూడా పెరిగిపోతున్నాయి. వారం క్రితం వెస్ట్ ఇంఫాల్ జిల్లాలోని తరోయ్‌ జామ్‌ లో ఫరూక్‌ఖాన్ అనే స్టూడెంట్‌ ను స్కూటర్ దొంగిలిస్తున్నాడనే అనుమానంతో జనం కొట్టిచంపిన ఘటన సంచలనమైంది. దీంతో ఇకపై ఇలాంటి గుంపు దాడులకు చెక్ పెట్టాలని భావించిన మణిపూర్ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy