మూడు తరాల వారధి.. జయశంకర్ సార్..

jayashankar-sir-2నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రాన్ని.. ఆంధ్రా ప్రాంతంలో కలుపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రొ.జయశంకర్ సార్. నిజాం పాలన సంకెళ్లను తెంచుకున్న తెలంగాణను ఆంధ్రాలో కలిపితే.. మళ్లీ భానిసత్వంలోకి నెట్టడమేనని గట్టిగా వాదించిన తొలి విద్యార్థినేత. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంతో పోరాటం మొదలెట్టిన జయశంకర్.. ఆ తర్వాత అయిదు దశాబ్దాలకు పైగా ఉద్యమాన్ని భుజాలపై మోశారు. తొలితరం ఉద్యమానికి ఊపిరిగా నిలిచి.. మలితరం ఉద్యమానికి మార్గదర్శి అయ్యారు ప్రొఫెసర్. తెలంగాణ సిద్ధాంత కర్తగా పాఠాలు బోధించి.. కేసీఆర్ లాంటి నాయకులను ముందుకు నడిపించిన తెలంగాణ జాతిపిత ప్రొ.జయశంకర్ మూడో వర్ధంతి నేడు.

ప్రొ.జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీ కాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్టులో జన్మించారు. ప్రాథమిక విద్యనుంచి హెచ్ఎస్సీ వరకు వరంగల్ లోనే చదివారు. ఉస్మానియూ యూనివర్సిటలో బీఏ చేసిన ఆయన.. బెనారస్ హిందూ వర్సిటీ నుంచి ఎకానమిక్స్ లో పీజీ పట్టా పొందారు. ఆ తర్వాత 1960లో టీచర్ గా జీవితాన్ని ప్రారంభించారు. 60 వరకు విద్యర్థిగా ఉద్యమాన్ని నడిపిన జయశంకర్ సార్.. ఆ తర్వాత టీచర్ గా, ప్రొఫెసర్ గా ఉద్యమాన్ని నడిపారు. 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్నుంచి దేశ వ్యాప్తంగా తెలంగాణ వాదాన్ని మోస్తూ.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత తెలియజేశారు. 1999లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసి.. తెలంగాణ వాదులందర్నీ ఏకం చేశారు. ఆ తర్వాత అమెరికా వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లి.. ఎన్నారైల మద్ధతు సమీకరించారు. 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంత కర్తగా వ్యవహరించారు. కేసీఆర్ ను పార్టీ పెట్టించడం వెనుక జయశంకర్ సార్ కృషి ఎంతో ఉంది. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన టైంలో ఆయనతో పాటు ధైర్యాన్నిచ్చారు. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడుతుందని, తానె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేవరకు బతికే ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మరి కొద్ది రోజుల్లో తెలంగాణ ఏర్పడుతుందనే ముందు ఆయన కన్నుమూశారు. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సార్.. తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే జూన్ 21, 2011లో సెలవు తీసుకున్నారు. నిరంతరం తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై శ్రమించిన ప్రొ.జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.. ఇవే మన నివాళులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy