మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం…?

download (4)
ఇకపై తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. దేశంలో 29వ కొత్త రాష్ట్రం. తెలంగాణ బిల్లుకు రాష్టపతి ఆమోద ముద్ర వేయడం లాంచనమే. అయితే రాష్ట విభజన ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఎంత సమయం పట్టొచ్చు. విద్యా, ఉద్యోగం, రెవెన్యూ పంపకాల పరిస్థితేంటి. ఈ ప్రశ్నలపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి రాష్టపతి ఆమోద ముద్ర లభించడం ఇక లాంచనమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రాష్ట్రపతి ఆమోదం తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాలపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఫుల్ క్లారిటీనిచ్చారు. 4, 5 రోజుల్లో రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ విడుదలవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీని అందులోనే పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉందన్నారు జైరాం రమేష్. అప్పాయింటెడ్ డే తర్వాతే కొత్త రాష్ట్రం అధికారికంగా ఏర్పాటవుతుందన్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు సీఎంలు, ఇద్దరు సీఎస్ లు, ఇద్దరు డీజీపీలు ఉంటారని తెలిపారు. జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నోటిఫికేషన్ తర్వాత మూడు నెలల తర్వాత అధికారికంగా ఏర్పాటు అయ్యాయన్నారు జైరాం.

ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే…విభజన ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందా అనేది డౌటే. ఓవైపు సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. కిరణ్ రాజీనామా తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం అవుతుందా? మూడు నెలల్లోనే ఈ తతంగం పూర్తవుతుందా…అన్నది చర్చానీయాంశంగా మారింది.

ఇక విభజన ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా పూర్తికాకపోతే…రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కూడా కష్టంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. మూడు నెలల్లోనే రాష్ట్ర విభజన ప్ర్రక్రియ పూర్తికావాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ ను మరింతగా స్పీడప్ చేయాల్సి ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy