మూడు నెలల్లో మెట్రో రైలు

metroఎప్పుడెప్పుడా అని జనం ఎదురు చూస్తున్న మెట్రో రైలు మరో మూడు మాసాల్లో పరుగులు పెట్టనుంది. హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా మెట్రో రైళ్లను నడపలేకపోయారు. ఇప్పటికే నా గోల్‌-మెట్టుగూడ మార్గంలో 8కి.మీ మేర, మియాపూ ర్‌-ఎస్సార్‌నగర్‌ మార్గంలో 10 కి.మీ మేర మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయినా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ట్రయల్‌ రన్స్‌ పేరుతో మెట్రో రైళ్లు ఆరెండు మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ మెట్రోరైళ్లను మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పడంతో నగర వాసుల్లో ఉత్సాహం నెలకొంది. తొలుత మియాపూర్‌ నుంచి ఎస్సార్‌నగర్‌ వరకు పూర్తయిన మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తామన్నారు సీఎం. ముఖ్యంగా నాగోల్‌ నుం చి మెట్టుగూడ వరకు వచ్చిన మార్గాన్ని సికింద్రాబాద్‌ మీదుగా బేగంపేట వరకు మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. దీంతో నాగోల్‌ నుంచి బేగంపేట వరకు 15 కి.మీ, మియాపూర్‌ నుంచి ఎస్సార్‌నగర్‌ వరకు మరో 10 కి.మీ మార్గంతో కలిపి మొత్తం 25కి.మీ మేర మెట్రో రైలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy