మూడు రోజులు జోరు వానలు : వాతావరణ శాఖ

RAIN TSరాష్ట్రంలో వానల జోరు కొనసాగుతోంది. మంగళవారం (జూన్-5) ఉదయం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడగా.. సాయంత్రం తరువాత హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల వర్షం కురుస్తోంది. శివారు ప్రాంతాలు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనర్, హయత్ నగర్, దిల్ షుక్ నగర్, కొత్తపేట చాదర్ ఘాట్ లో మోస్తరు వర్షం పడుతోంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రీమాన్ సూన్ ఎఫెక్టే అని తెలిపింది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో నైరుతి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుందనీ, రేపు తేలికపాటి జల్లులు, భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. గురువారం (జూన్-7) నుంచి దక్షిణ తెలంగాణలోని  వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో మంగళవారం (జూన్-5) మరింతగా విస్తరించిన నైరుతీ, బుధవారం (జూన్-6) సాయంత్రం తరువాత తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy