మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం ఇవాళేనా!

world-war-3అగ్రరాజ్యం అమెరికా, అణు దేశం ఉత్తరకొరియాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఉత్తర కొరియా ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా… అమెరికా మీద బాంబు వేసేద్దామా అని ఆత్రుతగా చూస్తోంది. అమెరికా కూడా తక్కువేమీ తినలేదు. ఎలాగైనా ఉత్తరకొరియాను మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ఉత్తరకొరియా శత్రుదేశమైన దక్షిణకొరియాకు సైనిక సహాయాన్ని అందిస్తోంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. కాగా మన మన దేశానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మూడో ప్రపంచయుద్ధం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అది కూడా శనివారం( మే 13) నుంచే యుద్ధం మొదలు కానుందని తెలిపారు. ఆయనెవరో కాదు ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రమోద్ గౌతమ్. గతంలో ట్రంప్‌ గెలుస్తాడని ప్రమోద్‌ చెప్పిన జోష్యం నిజం కావడంతో.. తాజాగా ఆయన చెప్పిన శకునాన్ని ప్రపంచ మీడియా హైలైట్‌ చేసింది. కుజగ్రహ పీడితుడైన డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో తీవ్ర చర్యలకు దిగుతారని చెబుతున్నారు.

అంతేకాదు యుద్ధనివారణ కోసం ఆగ్రాలోని యమునా నదీ తీరంలో శాంతి పూజలు కూడా చేశారు. అమెరికా ఎన్నికల సమయంలో కూడా ఇలాగే జ్యోతిష్యం చెప్పారు ప్రమోద్. అందరూ హిల్లరీ గెలుస్తుందని ఊహిస్తే… ఆయన మాత్రం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతారని చెప్పారు. ఆయన అన్నట్టే జరిగింది. ట్రంప్‌ గెలుపు కోసం యజ్ఞం కూడా నిర్వహించిన ప్రమోద్.. ఇప్పుడు ట్రంప్‌ వల్లే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని, దానిని నివారించేందుకే శాంతి యజ్ఞం చేశానని చెబుతున్నాడు. అమెరికాకు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కష్టకాలమని… ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్లే అగ్రరాజ్యంలో హింస వాటిల్లుతుందని చెప్పారు.

మూడో ప్రపంచ యుద్ధంతోపాటు భారత్‌- పాకిస్థాన్‌ సంబంధాలపైనా ప్రమోద్‌ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. కశ్మీర్‌ విషయంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతాయన… అతి త్వరలోనే అవి ఉపద్రవానికి దారితీస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy