మూణ్నాళ్ల ముచ్చటైన ఇమ్రాన్‌ఖాన్ మూడోపెళ్లి

imrankhan marriedపాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ మూడోపెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలేలా ఉంది. ఆయన మూడో భార్య బుష్రా మనేకా పుట్టింటికి వెళ్లిపోయింది. బుష్రా మనేకా కొడుకు తమతోపాటు ఉండటం ఇమ్రాన్‌ఖాన్‌కు ఇష్టం లేదు. అటు ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకున్న కుక్కలు ఇంట్లో ఉండటం బుష్రాకు నచ్చలేదు. దీంతో అప్పుడే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. బుష్రా బంధువులు ఎవరూ వాళ్లతోపాటు ఎక్కువ రోజులు ఉండకూడదు అని పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే బుష్రా కొడుకు మాత్రం వీళ్లతోనే ఉండటంతో ఇద్దరి మధ్య తగదాలు ఏర్పాడ్డాయి.

ఫిబ్రవరి 18న  ఇమ్రాన్,బుష్రా పెళ్లి జరిగింది. 1995లో మొదటి సారి జెమీమాను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. 9 ఏళ్ల తర్వాత విడాకులిచ్చాడు. 2015లో టీవీ యాంకర్ రేహమ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నా పది నెలల తర్వాత విడిపోయారు. ఇప్పుడీ మూడో పెళ్లి కూడా రెండు నెలల్లోపే ముగిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy