మూల కణ పరిశోధనలో విప్లవాత్మక అడుగు!

haruవైద్య పరిశోధనలో ‘స్టెమ్ సెల్స్’ – ‘మూల కణాలు’ గొప్ప మార్పులను తేవడం తో పాటు, సరికొత్త ఆశలను రేకెత్తించాయి. ఐతే ఈ పరిశోధన ఇంకా బుడి బుడి అడుగుల దశలోనే ఉండటమే కాక అంతులేని ఖర్చులతో కూడుకుని ఉంది. ఇందులో ప్రధాన విరోధం నిజమైన స్టెమ్ సెల్స్ స్థానంలో అలా ప్రవర్తించే రెండో స్థాయి స్టెమ్ సెల్స్ ను సిద్ధం చేయడం. ఎముక మజ్జి కణాల తర్వాత చర్మ కణాలకు అలా మూల కణాలు గా మారే సామర్ధ్యం ఉంది. అవి కాక వేరే శరీర భాగాలు ఇలా మారలేకపోవడం, చర్మ కణాలను కూడా ఇలా మార్చే ప్రక్రియ చాలా సమయం, ఖర్చుతో కూడిన ప్రక్రియ కావడం వల్ల కొన్ని రకాల చికిత్సల్లో ఈ పద్ధతిని వాడలేక పోతున్నారు.

అయితే జపాన్ కు చెందిన Riken Centre for Developmental Biology శాస్త్రవేత్త డా. హరుకో ఒబోకాటా ఒక సరికొత్త పద్ధతిలో త్వరితంగా, చవకగా శరీర కణాలను మూలకణాలుగా మార్చే పద్ధతిని ఆవిష్కరించారు. ప్రతి జీవిలోనూ విస్తారంగా ఉండే రక్త కణాలనే ఒక రకమైన ఆమ్లంలో ముంచడం ద్వారా, అంటే ఆ కణాలను ‘షాక్’ కు గురిచేయడం ద్వారా వాటిని మూల కణాలుగా ప్రవర్తించేలా చేయవచ్చని వీరు చెబుతున్నారు. ఎలుకలపై ఈ ప్రయత్నం ఇప్పటికే ఫలించిందని వీరు నేచర్ పత్రికలో ప్రకటించారు. ఈ ప్రయోగం మనుషులపై ప్రారంభమైందని కూడా తెలిపారు.

పరిశోధనా లోకమంతా ఈ ఫలితాల వల్ల మునుపెరుగని చికిత్సా పద్ధతులు ఎన్నో వస్తాయనడంలో సందేహం లేదని సంబర పడుతున్నారు. గుండె, కళ్ళు, కాలేయం లాంటి అవయవాల మార్పిడిలో, ఇంకా అనేక పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ ప్రత్యేకించిన ట్రీట్ మెంట్ చేపట్ట గలిగే రోజులు ఎంతో దూరం ఉండబోవని కూడా వారు చెబుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy