మూవీ రివ్యూ : జై లవకుశ

LAVAKUSAరన్ టైమ్: 2 గంటల 38 నిమిషాలు

నటీనటులు: ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేతా థామస్, సాయికుమార్, పోసాని, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, ప్రియదర్శి, ప్రవీణ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

స్క్రీన్ ప్లే: కోన వెంకట్, చక్రి

నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాబీ

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 21, 2017

యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ నటన అద్భుతం అనటానికి ‘జై లవకుశ’ మూవీ చూస్తే సరిపోతుంది. మాములుగా వేరే సినిమాలు చూస్తే.. కథ, కథనం మాట్లాడుకుంటాం. ఈ సినిమా చూశాక ఎన్టీఆర్ నటన గురించే మాట్లాడుకుంటాం. కథ కామన్ అయినా, కథనం యావరేజ్ గా ఉన్నా.. సినిమా మొత్తం తన నటనతో నిలబెట్టాడు తారక్.

‘జై లవకుశ’ ఒకే పోలికలున్న ముగ్గురు అన్నదమ్ముల కథ. చిన్నప్పడు తనకు నత్తి ఉందని తమ్ముళ్ల అవమానించారని వాళ్లపై కోపం పెంచుకుంటాడు జై. ఆ ప్రభావమే తనను రావణ్ గా మారుస్తుంది. పెద్దయ్యాక పొలిటికల్ గా వాళ్ల అవసరం ఉందని తెచ్చి పెట్టుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తమ్ముళ్లను ఎలా ఇబ్బంది పెట్టాడు?తమ్ముళ్లు అన్నయ్యను మార్చడానికి ఎలా ప్రయత్నించారు అనేది కథ.

ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. చిన్నప్పుడు తనను అవమానించారని తమ్ముళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ అంత కన్వీన్సింగ్ గా అనిపించదు. దీన్నే సబ్ ప్లాట్ గా తీసుకుని పొలిటికల్ గా ఇంకో మెయిన్ ప్లాట్ డెవలప్ చేస్తే బాగుండేది. అంతటి ఆస్కారం ఉన్న కథ, నటుడు దొరికారు కాబట్టి.. ఎంత గొప్ప నటుడు దొరికినా కథ, కథనాలు కూడా బాగా కుదరాలి.‘‘జై లవకుశ’’ కు అదే కాస్త మైనస్ అయ్యింది. పాయింట్ ఇంట్రెస్టింగానే అనుకున్న దాన్ని సినిమాగా మలచడంలో తడబడ్డాడు డైరెక్టర్.

ఫస్టాఫ్ కాస్త బోరింగ్, కాస్త ఎంటర్ టైన్ మెంట్ గా సాగిపోతుంది. లవ లవ్ ఎపిసోడ్, ఎలాగైన డబ్బులు కొట్టేసి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే కుశ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు జై క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాక సినిమా ఊపందుకుంటుంది. జై, లవ, కుశ ముగ్గురు కలిసి చేసిన డ్రామా ఎపిసోడ్లు రక్తి కట్టిస్తాయి. అన్నయ్య మనసు మార్చాలని తమ్ముళ్లు చేసిన డ్రామాలో సెంటిమెంట్ బాగా పండింది. క్లైమాక్స్ హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది.

మూడు క్యారెక్టర్లల్లో ఎన్టీఆర్ జీవించేశాడు. మూడు పాత్రల్లో తనే నటిస్తున్నా.. మనకు క్యారెక్టర్లే కనిపిస్తాయి. అదే అతని నటన గొప్పతనం. రాశీఖన్నా సన్నబడి గ్లామరస్ గా కనిపించింది. మంచి పర్ఫార్మర్ గా పేరున్న నివేతా థామస్ మాత్రం నటనకు అవకాశమే రాలేదు. సాయికుమార్, పోసాని క్యారెక్టర్లు బాగున్నాయి. బ్రహ్మాజి, ప్రవీణ్, ప్రియదర్శి నవ్వించే ప్రయత్నం చేశారు.

ఛోటా కె.నాయడు కెమెరా వర్క్ చాలా బాగుంది. టెక్నికల్ గా ప్లస్ అయ్యింది. మ్యూజిక్ విషయంలో దేవీశ్రి ప్రసాద్ మాత్రం నిరాశ పరిచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. కోన వెంకట్ డైలాగులు బాగా పేలాయి. ఎడిటింగ్ ఓకే. గ్రాఫిక్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా ‘జై లవకుశ’ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి చూడటానికి బాగుంటుంది. దసరా హాలిడేస్ కాబట్టి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించే సినిమా అవుతుంది.

బాటమ్ లైన్: ఎన్టీఆర్ షో

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy