మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్సేషియా : కేసీఆర్

KCRవరంగల్ భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. బుధవారం (జూన్-4) వరంగల్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 10 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy