మృత్యువు తలను తాకుతూ వెళ్లింది

flightప్రపంచంలో ఉన్న డేంజరస్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఒక‌టి గుస్తాఫ్ -3 ఎయిర్‌పోర్ట్. విమానాలు టేకాఫ్ స‌మ‌యంలో గానీ, ల్యాండింగ్ స‌మ‌యంలోకానీ పైల‌ట్ ఏమాత్రం ఉదాసీన‌త‌తో వ్య‌వ‌హ‌రించినా.. ప్రాణాలు గాల్లోనే క‌లిసిపోతాయి. ఇక వివ‌రాల్లోకెళితే ఓ తేలిక‌పాటి విమానం గుస్తాఫ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు వ‌స్తుండ‌గా తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ టేకాఫ్ దృశ్యాల‌ను చిత్రీక‌రిస్తున్న ఓ ఔత్సాహికుడికి షాకింగ్ సీన్ ద‌ర్శ‌న‌మిచ్చింది.  రోడ్డుపై బైక్‌లో వెళుతున్న వ్య‌క్తి త‌ల‌పైనుంచి కొన్ని అంగుళాల ఎత్తులో  ఓ విమానం ఎగురుతూ కెమెరా కంటికి చిక్కింది. ఆ త‌ర్వ‌త రోడ్డుపై వ‌స్తున్న ట్ర‌క్కును కూడా ఢీకొట్టే ప్ర‌మాదం నుంచి పైల‌ట్ చాక‌చ‌క్యంతో త‌ప్పించాడు. ఆవీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy