స్టెప్పులేస్తున్న మెగాస్టార్

chiruమెగాస్టార్ చిరు చాలా రోజుల తర్వాత షూటింగ్ సెట్ లో  అడుగు పెట్టారు. ఎంటర్ అవ్వడమే కాదు… మేకప్ వేసుకొని… యాక్ట్ కూడా చేసేశారు. ఈలలు… గోల మధ్య.. షూటింగ్ ఎంజాయ్ చేశారు చిరు. ఏంటీ అప్పుడే చిరు 150వ సినిమా స్టార్ట్ అయ్యిందనుకున్నారా.. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సడన్ సర్ ప్రైజ్ ఏంటీ అని ఊహించేసుకోకండి. ఇదంతా తనయుడు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ షూటింగ్ స్పాట్ లో జరిగింది. 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరు నాటి నుంచి ఇవాళ్టి వరకు కెమేరా ముందుకు రాలేదు. ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లలో మాత్రమే కనిపించారు. 150వ సినిమాతోనే కెమెరా ముందుకు వస్తారనుకున్న చిరు తన కుమారుడు రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రంలో నటిస్తున్నారు. బ్రూస్లీ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తున్న చిరు ఇవాళ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఓ పాటకు కూడా చిరంజీవి స్టెప్పులేయనున్నారు.

mega-star-chiranjeevi-character-revealed-in-bruce-lee

phoca_thumb_m_Chiranjeevi-Latest-Photoshoot-08chiranjeevi-profile

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy