మెగాస్టార్ ను కలిసిన పవర్ స్టార్

71445168824_625x300మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ కలిశారు. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్  నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్ కు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ స్వాగతం పలికి ఆహ్వానించారు. చాలా కాలం తర్వాత ‘బ్రూస్ లీ’ లో నటించిన అన్నయ్య చిరంజీవిని పవన్ అభినందించారు. చిరుతో పాటు రామ్ చరణ్ లను పవన్ అభినందించారు. పవన్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత చిరంజీవితో అంతరం ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే  చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయ్యను కలిసిన పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలవడం ఇది రెండోసారి. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరిశారు. చిరును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన  పవన్… తమ మధ్య రాజకీయ విధానాలు వేరుగా ఉన్నా… సినిమా, కుటుంబ పరంగా తనకు అన్నయ్య అంటే గౌరవం, ఇష్టమన్నారు. అమరావతి శంకు స్థాపనకు హాజరుకావడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కల్యాణ్.

18brk186b

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy