మెగా బ్రదర్స్ ఏరీ?

1రాంచరణ్ బ్రూస్ లీ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మెగా బ్రదర్స్ కనిపించకపోవటం హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ ముందుండే నాగబాబు ఈసారి రాలేదు. పవర్ స్టార్ కూడా ఎప్పట్లాగే డుమ్మా కొట్టారు. వీళ్లిద్దరూ సరే.. తమ్ముడు వరుణ్ తేజ్, మెగా హీరోయిన్ నీహారిక సైతం ఫంక్షన్ కు రాలేదు. ఫంక్షన్ ఏదైనా మెగా ఫ్యామిలీలో ఎవరు కనిపించినా.. పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే స్లోగన్స్ కామన్.. అయితే ఈసారి అటువంటివి ఏమీ వినిపించనూ లేదు. అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్క అరవింద్ తప్పితే.. అర్జున్, శిరీష్ కూడా రాకపోవటం ఏంటానే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. పవన్ వస్తున్నాడా.. లేడా అనేది చర్చ కాకపోయినా.. ఫంక్షన్ దగ్గర వెల్ కం టూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ బ్రూస్ లీ టీం పేరుతో బ్యానర్ ప్రత్యక్షం అయ్యింది. బ్యానర్ ముందే ప్రిపేర్ చేశారంటే.. వస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయా.. చివరి నిమిషంలో పవన్ డుమ్మా కొట్టాడా ఏంటీ అని మెగా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. ఏమైనా ఫ్యామిలీలో ఎవరి సినిమా ఆడియో ఫంక్షన్ అయినా.. సపోర్ట్ గా అందరూ ప్రత్యక్షం అయ్యేవారు.. బ్రూస్ లీకి మాత్రం కేవలం చిరంజీవి ఇంట్లో జరుగుతున్న పండగలాగే ఉండటం విడ్డూరమే. స్పీచ్ లలో కూడా ఎక్కడా మిగతా వాళ్ల పేర్ల ప్రస్తావన అస్సలు లేదు. కేవలం చరణ్ బావమ్మర్ది.. సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీ హీరో సాయి థరమ్ తేజ్ ఒక్కడే హాజరయ్యాడు. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది.. అన్నదమ్ములు ఎందుకు రాలేదు అనేది మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ అయ్యింది.

https://www.youtube.com/watch?v=RpPXezpsMwI

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy