మెగా మారథాన్…హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

marathonమెగా మారథాన్ కు సిద్ధమైంది హైదరాబాద్. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగనున్న ఈ మారథాన్ లో పాల్గొనేందుకు చిన్నా పెద్దా అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

2007 లో కేవలం ఐదుగురితో ప్రారంభమైన హైదరాబాద్ రన్  లో… ప్రస్తుతం 20వేల మంది సభ్యులున్నారు. అంతా ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకున్న వాళ్లే. ఒబెసిటీ తో బాధపడే వారి సంఖ్య రోజ రోజుకీ ఎక్కువ అవుతోంది. అంతే కాదు గుండె పోటు..పని ఒత్తిళ్లతో ఆరోగ్య సమస్యలు వస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఉత్తేజితం చేస్తాయి. ఇప్పటి వరకు నగరంలో ఆరు మారథాన్ నిర్వహించారు. ఆదివారం (ఆగస్టు 20)న 7వ మారథాన్ జరగనుంది. ఇందులో 16వేల మందికి పైగా ప్రజలు పాల్గొనే అవకాశముంది. అయితే ఆదివారం నిర్వహించనున్న ప్రారంభ చిహ్నంగా శనివారం (ఆగస్టు19) 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు.

ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం(ఆగస్టు 20) ఉదయం కొనసాగే మారథాన్ రన్ – 2017 సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్యలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం(ఆగస్టు 20) ఉదయం 4.30 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుంది. సైబరాబాద్‌లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా నిర్ణీత సమయంలో ఆయా రూట్లలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపుతో ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ మళ్లించే కూడళ్లు ..

ఖైరతాబాద్‌లోని వీవీ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్, లిబర్టీ, కర్బలా మైదాన్,
కవాడిగూడ క్రాస్ రోడ్డు, డీబీఆర్ మిల్స్, నల్లగుట్ట జంక్షన్, గ్రీన్‌లాండ్ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్
ఐలాండ్, క్యాన్సర్ ఆసుపత్రి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డు నెం.1/45 జంక్షన్, రోడ్డు నెం.36/10
జంక్షన్.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లించే కూడళ్లు..

కావూరి హిల్స్/36 జంక్షన్, సైబర్ టవర్ జంక్షన్, బయో డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, జీహెచ్‌ఎంసీ అఫీస్ లింగంపల్లి జంక్షన్, విప్రో జంక్షన్, గోపన్నపల్లి క్రాస్ రోడ్స్. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదివారం ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, వాటర్ ట్యాంకు తదితర వాహనాలకు అనుమతి ఉండదని సైబరాబాద్ సీపీ తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy