మెగా షో: ఖైదీ నెంబర్ 150

150రన్ టైమ్: 2గంటల 27 నిమిషాలు

నటీనటులు: చిరంజీవి,కాజల్, తరుణ్‌ అరోరా,బ్రహ్మానందం, అలీ,పోసాని,రఘుబాబు, పృథ్వి,జయప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్:  దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

రచన: పరచూరి బ్రదర్స్

మాటలు:సాయి మాధవ్ బుర్రా, వేమారెడ్డి

కథ: ఏ.ఆర్.మురుగదాస్

నిర్మాత: రాంచరణ్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి వినాయక్

రిలీజ్ డేట్: జనవరి 11,2017

ఇంట్రో:

రాజకీయాల్లోకి వెళ్లిన  తర్వాత దాదాపు తొమ్మిదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నటించిన మూవీ ‘‘ఖైదీ నెంబర్ 150’’..  ఆయన 150వ సినిమాగా  వచ్చిన ఈ మూవీ పై అటు మెగా ఫ్యాన్స్..ఇటూ, ప్రేక్షకుల్లో క్రేజ్ విపరీతంగా ఉంది.. తమిళంలో సూపర్ హిట్టైన ‘కత్తి’’ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఇక్కడి అంచనాలను అందుకుందో లేదో సమీక్షిద్దాం..

కథేంటి?

జైలు నుండి తప్పించుకున్న కత్తి శీను (చిరంజీవి) అనే దొంగ ఎలాగైనా బ్యాంకాక్ లో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు..ఈ క్రమంలో అనుకోకుండా ఒక ప్రమాదంలో శంకర్ (చిరంజీవి)ని కాపాడాల్సి వస్తుంది..అచ్చం తన పోలికలతో ఉన్న అతడ్ని పోలీసులకి పట్టుబడేలా చేసి అతని స్థానంలోకి వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుంటాడు.

కానీ శంకర్ జీవితం మీద ఒక ఊరి రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్న కత్తి శీను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అసలు శంకర్ ఎవరు అన్నది మిగతా స్టోరీ..

విశ్లేషణ:

వినటానికి ప్రెడిక్టబుల్ స్టోరీలాగే అనిపించినా.. ఈ కథ తమిళంలో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది.. కమర్షియల్ సినిమాకు మంచి స్కోప్ ఉన్న ఈ మూవీని చిరంజీవి తన కమ్ బ్యాక్ 150వ సినిమాగా ఎంచుకోవటం లోనే సగం వరకు పాస్ అయ్యారు.. ఎమోషన్,ఎంటర్ టైన్మెంట్ రెండింటికి ఆస్కారం ఉన్న ఈ కథ చిన్న చిన్న మార్పులు చేసి సక్సెస్ అయ్యారు ‘‘ఖైదీ నెంబర్ 150’’ టీమ్.. చిరంజీవి నుంచి కోరుకునే డాన్సులు, ఫైట్లు, కామెడీ ని బాగానే దట్టించి సేఫ్ గేమ్ ప్లే చేశాడు వి.వి వినాయక్.. అయితే ఈ క్రమంలో ఒరిజినల్ ‘‘కత్తి’’ లో ఉండే ఎమోషన్ ఇక్కడ మిస్ అయ్యింది..ఇంట్రవెల్ కు 10 నిమిషాల ముందు రైతుల గురించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను మాత్రం హార్ట్ టచింగ్ గా తీసారు.. ఇక స్టోరీ రీవీల్ అయ్యేదాక బ్రహ్మానందం తో చేయించిన కామెడీ సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోవు..

ప్లస్ లు

  1. చిరంజీవి
  2. కథ
  3. ప్రీ ఇంటర్వెల్

మైనస్ లు:

  1. ప్రెడిక్టబుల్ సెకండాఫ్
  2. కామెడీ

పదేళ్లు గ్యాప్ తీసుకున్నా కానీ.. చిరంజీవి పర్ఫార్మెన్స్ లో మాత్రం తేడాలేదు. డాన్సుల్లో గ్రేస్, కళ్లల్లో ఇంటెన్సిటీ, పాత చిరును గుర్తుకు తెస్తాయి.. ఈ ఏజ్ లో కూడా ఎనర్జీగా కనిపించే ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. స్టైలింగ్ బాగుంది కానీ బాడీ మేకోవర్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది.  కాజల్ కు నటించే స్కోప్ లేదు.  పాటలకే పరిమితమైంది.  విలన్ తరుణ్ అరోరా వీక్ అయిపోయాడు. అలీ, బ్రహ్మానందం , పోసాని, పృథ్వీ ,జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు లతో చేయించిన కామెడీకీ బీ,సీ సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.. ‘‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’’ సాంగ్ లో తండ్రి చిరుతో స్టెప్ వేసి ఆడియన్స్ ను కనువిందు చేశాడు రాంచరణ్..

సినిమాకు టెక్నీషియన్స్ పెద్ద అస్సెట్ అయ్యారు. రత్నవేలు  కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా తీసి మూవీకి విజువల్ గ్రాండీయర్ తీసుకొచ్చాడు.. దేవీశ్రీ ప్రసాద్ పాటలు అన్నీ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది..కానీ కొన్ని సీన్లలో ‘‘కత్తి’’ రీ రికార్డింగ్ ను కాపీ కొట్టినట్టనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది.  రైతుల గురించి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి..పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది.సుందరి సాంగ్ లో కంపోజ్ చేసిన చిన్న చిన్న డాన్సు స్టెప్స్ ఆకట్టుకుంటాయి.

ఓవరాల్ గా చిరంజీవి నుంచి ఆశించే ఆయన తరహా కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘‘ఖైదీ నెంబర్ 150’’.. కథతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా.. తెలుగు ఆడియన్స్,మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా ‘‘కత్తి’’ కి కాస్త మసాలా దట్టించి సర్వ్ చేశాడు డైరెక్టర్ వి.వి వినాయక్. సంక్రాంతి సెలవులు, చిరంజీవి ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యే చాన్సుంది. కమర్షియల్ గా బాగానే వసూళ్లు రాబట్టే సినిమా అవుతుంది.

రేటింగ్: 3/5

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy