మెగా హీరో కొత్త సినిమా ప్రారంభం

9brksaidharam2మెగా హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు. ఓ పక్క వరుస సినిమాలతో షూటింగ్ లో బిజీగా ఉంటూనే.. తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు.  వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్  బుధవారం(ఆగస్టు-9)న లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ కొట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి ఆశీర్వాదాలతో సినిమాను ప్రారంభించినట్లు చిత్ర బృందం పేర్కొంది. సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నదీ తెలియాల్సి ఉంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో సాయిధరమ్‌ నటించిన ‘నక్షత్రం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన అలెగ్జాండర్‌ పాత్రలో పోలీసు అధికారిగా కనిపించాడు. ప్రస్తుతం సాయిధరమ్‌ ‘జవాన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. బి.వి.ఎస్‌. రవి దర్శకుడు. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy