మెచ్చుకోవాల్సిందే.. గర్వపడాల్సిందే : లైన్ లోకి వచ్చిన వాహనదారులు

traffic-signalతిన్నగా చెబితే ఒకరు, ఇద్దరు వింటారు.. అదే భయపెడితే అందరికీ ఎక్కుతుంది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు అమలు చేసిన పాయింట్స్ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. 12 పాయింట్లు పడితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం.. బండి సీజ్ చేస్తాం.. ఆ తర్వాత జైలు శిక్ష విధానం ప్రవేశపెట్టారు. స్టార్ట్ చేసినప్పుడు అందరూ తిట్టిపోసుకున్నా.. క్రమ క్రమంగా అలవాటు పడ్డారు వాహనదారులు.

జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు జీబ్రా లైన్ దాటి రాకూడదు. మొన్నటి వరకు సగం జంక్షన్ జామ్ అయ్యేది. నిన్నటి ఇలాగే ఉండేది. ఇప్పుడు అలా లేదు. అంతా మారిపోయింది. గీత దాటే వాహనాల ఫొటోలు తీసి.. పాయింట్లు వేసేస్తున్నారు. మీకు తెలియకుండానే మీ వాహనానికి పాయింట్ పడుతుంది. దీంతో వాహనదారుల్లో కంట్రోల్ వచ్చింది. ఆరంజ్ సిగ్నల్ పడగానే బ్రేక్ వేస్తున్నారు. వెనక వచ్చే వారికి సూచనలు ఇస్తున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయినా పర్వాలేదు.. పాయింట్ పడకూడదనే ఉద్దేశం బుర్రలకు బాగా ఎక్కేసింది.

ఈ ఫొటోలే సాక్ష్యం. హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రమశిక్షణకు. గతంలో అడ్డదిడ్డంగా ఉండే వాహనాలు ఇప్పుడు చక్కగా లైన్ లో ఉన్నాయి. ఎవరో గీతగీసి ఆపినట్లు.. చక్కగా ఉన్నాయి. ఏదో ఒకటీ రెండు సిగ్నల్స్ దగ్గర కాదు.. సిటీలోని దాదాపు అన్ని జంక్షన్స్ దగ్గర ఇప్పుడు ఇదే క్రమశిక్షణ పాటిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, సీసీఎస్, ట్యాంక్ బండ్, అబిడ్స్ ప్రాంతాల్లో వాహనదారుల్లో వచ్చిన మార్పుకు ఈ ఫొటోలే సాక్ష్యం. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండీ.. ట్రాఫిక్ పోలీస్ లేడు అక్కడ. కేవలం సిగ్నల్స్ ఆధారంగా ఎవరికి వారు ఇలా చక్కగా రూల్స్ పాటించారు. ఎప్పుడూ ఇతర దేశాల్లో అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని చెప్పుకునే మనం ఇక నుంచి హైదరాబాద్ వాహనదారుల క్రమశిక్షణ గురించి కూడా చెప్పుకోవచ్చు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy