మెజార్జీ పిచ్చి..సోకు లేదు : కేటీఆర్

తనకు ఎన్నికల్లో మెజార్టీ పిచ్చి లేదు.. సోకు లేదు.. మెజార్టీ ముఖ్యం కాదు.. గెలుపు ముఖ్యమన్నారు మంత్రి కేటీఆర్.  సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2006 ఎన్నికల్లో తనకు సిరిసిల్లతో రాజకీయ పరిచయం ఏర్పడిందన్నారు.

2006లోనే తాను రాజకీయాలు, ఉద్యమంలోకి వచ్చాను అని గుర్తు చేశారు. 2009లో 171 ఓట్ల మెజార్టీ, 2010లో 68 వేల ఓట్ల మెజార్టీ, 2014లో 53 వేల ఓట్ల మెజార్టీతో తనను ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇప్పుడేమో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటున్నాను. ఈ నాలుగేళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయి. నాలుగేళ్లలో సిరిసిల్ల ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతిపక్షాలు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పారు. రాబోయే మూడేండ్లలోనే సిరిసిల్లకు రైలు తీసుకువస్తానని కేటీఆర్ హామీనిచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతాం. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు కేటీఆర్.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy