మెట్రోకు పెరుగుతున్న ఆదరణ : 71 రోజుల్లోనే కోటీ ప్రయాణికులు

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ మెట్రోరైలుకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. 71 రోజుల్లోనే హైదరాబాద్‌ మెట్రోరైళ్లలో  కోటీ మంది ప్రయాణించారు. 351 రోజుల్లోనే మూడు కోట్ల మంది ప్రయాణించిన మైలురాయిని సొంతం చేసుకుంది హైదరాబాద్‌ మెట్రో. 2 కోట్ల నుంచి మూడు కోట్ల ప్రయాణికుల మైలురాయిని కేవలం 71 రోజుల్లో చేరుకోవడం హైదరాబాద్‌ మెట్రోకి లభిస్తున్న ప్రజాదరణకు నిదర్శనమంటున్నారు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి. మియాపూర్‌ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గాన్ని గత ఏడాది నవంబరు 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించగా.. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 24న అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మరో 16 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించారు గవర్నర్‌ నరసింహన్‌. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఎక్కువ మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy