మెట్రోపొలిస్ వాల్డ్ కాంగ్రెస్ ఈ రోజు నుంచే…!

cityదేశంలో తొలిసారి జరుగుతున్న 11వ మెట్రోపొలిస్ వాల్డ్ కాంగ్రెస్ కు హైదరాబాద్ రెడీ అవుతోంది. అధికారులు సిటీని అందంగా తీర్చి దిద్దుతున్నారు. ఈ నెల 7 నుంచి 10 వరకు సదస్సు జరుగనుంది. అయితే 6 నుంచే కార్యక్రమాలు మొదలవనున్నాయి. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మక మెట్రో పోలీస్ సదస్సుకు కోసం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. రోడ్ల నుంచి స్ట్రీట్ లైట్ల వరకు ప్రతీ అంశంపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వైఫై, 4జీ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 48 దేశాల నుంచి 380 మంది ఫారిన్ డెలిగేట్స్, మన దేశంలోని 80 నగరాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా చాలామంది ప్రముఖులు హాజరవనున్నారు. మెట్రో పోలీస్ సదస్సులో స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్ గవర్నెన్స్, సిటీ మేనేజ్ మెంట్ సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్ తో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వీటిలో సిటీ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను స్పెషల్ డిస్కషన్స్ ఉంటాయి. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు… ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రత్యేకంగా కలవనున్నారు. జొహన్నెస్ బర్గ్, బెర్లిన్, బార్సిలోనాలకు చెందిన డెలిగేట్స్ స్పెషల్ మీట్స్ పై ఇంట్రెస్ తో ఉన్నారు. సదస్సు వేదికల్ని బిజినెస్ టు బిజినెస్ గా వ్యవహరిస్తున్నారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్ లపై డెలిగేట్స్ జరిపే ఫీల్డ్ లెవెల్ విజిట్ ని వాల్డ్ వైడ్ గా లైవ్ టెలికాస్ట్  చేయనున్నారు. పట్టణ మౌళిక సదుపాయాలు, పౌరసేవలు తదిత అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ లో వివిద దేశాలకు చెందిన 50 స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. షహర్ నామా పేరుతో బాలల షార్ట్ ఫిలిమ్స్ ను ప్రదర్శించనున్నారు. అర్బన్ హాకథాన్ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్ వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు. ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలో, 7న ఫలక్ నుమా ప్యాలస్ లో, 8న జలవిహార్ లో స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. 7న సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సదస్సును ప్రారంభించనున్నారు. 9న రాష్ట్రపతి ప్రణబ్ మఖర్జీ హాజరు కానున్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పంపినా… పీఎంవో నుంచి ప్రకటన రాలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy