మెట్రో ఇంజినీరింగ్ అద్భుతం : 25 రోజుల్లోనే మలక్ పేట ఆర్వోబీ పూర్తి

robహైదరాబాద్ మెట్రో ఇంజినీరింగ్ అద్భుతం చేసింది. జాతీయ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ పనులు నిదానంగా సాగుతున్నా.. కీలకమైన ఎంతో కాంప్లికేట్ గా ఉన్న మలక్ పేట మెట్రో రైల్ ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను 25 రోజుల్లో పూర్తి చేయటం విశేషం. దేశంలోనే ఇప్పటి వరకు ఏ ఆర్వోబీ పనులు కూడా ఇంత త్వరగా కంప్లీట్ కాలేదని ప్రకటించింది మెట్రో నిర్మాణ సంస్థ. ఈ రోడ్డులో నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటాయి.

అదే విధంగా ఈ రైల్ రూట్ లో కూడా వందల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో అర్థరాత్రి దాటిన తర్వాత కేవలం మూడు గంటల టైం మాత్రమే నిర్మాణం కోసం అనుమతి ఇచ్చింది రైల్వే శాఖ. ఈ మూడు గంటల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. మరిన్ని గంటలు సమయం కోరినా రైల్వే శాఖ తిరస్కరించింది. హైదరాబాద్ – ముంబై రూటం కావటంతో ఇంత కంటే అదనంగా సమయం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు రైల్వే అధికారులు.

ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ముందస్తు కసరత్తు చేసింది. దీనికే రెండు నెలల సమయం తీసుకుంది. మొత్తం ఆర్వోబీ వంతెనపై 394 అడుగుల పొడవు నిర్మించాల్సి ఉంది. మొత్తం పనిని మూడు భాగాలుగా విభజించారు. ఇరువైపులా 98, 131 అడుగులు కాగా.. ప్రధానంగా రైల్వే ట్రాక్ పైభాగం 164 అడుగులు ఉంది. ముందస్తుగా 100 టన్నుల బరువును మోయగల రెండు భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ప్రధాన భాగానికి కావాల్సిన 12 ప్రీకాస్ట్ సెగ్మెంట్లను బ్రిడ్జ్ బిల్డర్ పద్దతిలో 25 రోజుల్లోనే అమర్చేశారు. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే పనిచేస్తూ.. ఇంత తక్కువ సమయంలో పని పూర్తి చేయటం దేశంలోనే సరికొత్త రికార్డ్ అని సంస్థ ఎండీ NVS రెడ్డి ప్రకటించారు. కచ్చితమైన ప్రణాళిక, రైల్వే వంతెన ఇంజినీరింగ్ ఉద్యోగుల కృషి ఫలితంగానే సాధ్యం అయ్యిందని వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy