మెట్టుగూడ-అమీర్ పేట్ : మెట్రో ట్రయల్ రన్ కు ఏర్పాట్లు పూర్తి

3869_Nagole17-600x390హైదరాబాద్ జనాన్ని ఊరిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో మరో మేజర్ డెవలప్ మెంట్ స్టార్ట్ కానుంది. త్వరలో ప్రారంభానికి సిద్దమవుతున్న 30 కిలోమీటర్ల మొదటి ఫేజ్ లో ట్రయల్ రన్ షురూ కాబోతోంది. ప్రభుత్వం.. మెట్రో అధికారులు చెప్పినట్టుగా నవంబర్ కల్లా  పెండింగ్ వర్స్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో కీలక పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి.

నాగోల్ టూ అమీర్ పేట్, మియాపూర్ టూ అమీర్ పేట్ రూట్లలో మేజర్ వర్స్క్ స్పీడ్ అప్ అయ్యాయి. ఇప్పటికే నాగోల్ టూ మెట్టుగూడ 8 కిలోమీటర్లు, మియాపూర్ టూ ఎస్ ఆర్ నగర్ వరకు 12 కి.మీ ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. మెట్టుగూడ టూ అమీర్ పేట్ 10 కి.మీ మేర ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మెట్టుగూడ టూ అమీర్ పేట్ రూట్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేశారు ఎల్ అండ్ టీ అధికారులు. ఈ రూట్లో ట్రైన్ ట్రాక్ వర్క్స్, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు అయిపోయాయి.  అమీర్ పేట్ మైత్రివనం దగ్గర కడుతున్న ఇంటర్ చేంజ్ స్టేషన్ పనులు దాదాపు కంప్లీట్ చేశారు మెట్రో ఇంజినీర్లు.

మెట్టుగూడ నుంచి అమీర్ పేట రూట్ లో ట్రయల్ రన్ కు అంతా సిద్ధం చేశారు మెట్రో అధికారులు. కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ డీవిఎస్ రాజు… ట్రయల్ రన్ మార్గంలో విద్యుత్ సరఫరాను పరీక్షించారు. మెట్టుగూడ.. బేగం పేట రూట్ లో ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ ట్రాన్సాక్షన్ సిస్టంను తనిఖీ చేసి.. సంతృప్తి వ్యక్తం చేశారని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. దీంతో రెండ్రోజుల్లో మెట్టుగూడ నుంచి ట్రయల్ కు ప్లాన్ చేస్తున్నారు. పట్టాల అమరిక, ఓలిపెంటా రైల్ ఓవర్ స్టీల్ బ్రిడ్జి పైన ట్రయల్స్, లాంటి టెక్నికల్ టెస్ట్ ల కోసం మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు.  ఇది సక్సెస్ అయితే నవంబర్ మొదటి వారం వరకు సెంట్రల్ రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్ వస్తుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy