మెట్రో పనులు 2018 నవంబర్‌ నాటికి పూర్తి

metro-trainమెట్రో ప్రాజెక్టు గడువు మరోసారి పెరడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం జూలై 4, 2017 నాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్టును 2018 నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామని తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు హైదరాబాద్‌ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం, మెట్రోప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, మెట్రో పనులపై ఏర్పాటు చేసిన స్వతంత్ర ఇంజనీరింగ్‌ సంస్థ లూయీస్‌ బెర్గర్‌ సంస్థల మధ్య జరిగిన చర్చల్లో ‘పొడిగింపు’నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా (5కి.మీ),హైటెక్‌ సిటీ–రాయదుర్గం (1కి.మీ) మినహా ఇతర పనులను ఈ గడువులోగా పూర్తిచేస్తామన్నారు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నాగోల్‌ –హైటెక్‌సిటీ (27 కి.మీ), ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ)మార్గాన్ని పూర్తిచేస్తామన్నారు ఎన్వీఎస్‌ రెడ్డి. నిర్మాణ గడువు పెంచని పక్షంలో బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలకు సంబంధించిన వాయిదాలను ఆగస్టు నెల నుంచే చెల్లించాల్సి ఉంటుందని ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రభుత్వానికి పలుమార్లు లేఖల రాయడంతోనే ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

న్యాయ వివాదాలే కారణం

మెట్రో పనులకు అవసరమైన ఆస్తుల సేకరణ అంశం జటిలంగా మారడం, పలు న్యాయవివాదాల కారణంగానే జాప్యం జరిగిందని, తత్ఫలితంగా గడువు పెరగడంతో రూ.4 వేల కోట్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు ఎన్వీఎస్‌ రెడ్డి.  మెట్రో పనుల కోసం అవసరమైన ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ హెచ్‌ఎంఆర్, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించారన్నారు. సుల్తాన్‌బజార్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో రహదారులను విస్తరించి మెట్రో పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy