మెట్రో పిల్లర్ ను ఢీ కొన్న డీసీఎం.. డ్రైవర్ మృతి

dcmహైదరాబాద్ ఎల్బీనగర్ లోని డీమార్ట్ దగ్గర  శనివారం (మే 20) తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన డీసీఎం వ్యాను మెట్రో స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతున్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎస్‌.కె. సర్దార్‌గా గుర్తించారు.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కట్టెల లోడ్ తో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్నారు పోలీసులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy