మెట్రో ప్రాజెక్టు 2 రెడీ : బీహెచ్ ఈఎల్, శంషాబాద్ వరకూ విస్తరణ

METమెట్రో రెండవ ఫేజ్ నిర్మాణంపై వేగంగా అడుగులేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్ PPP విధానంలో చేపట్టినప్పటికీ… రెండవ ఫేజ్ మాత్రం ప్రభుత్వ ప్రాజెక్టుగానే పట్టాలెక్కనుంది. రెండవ ఫేజ్ కారిడార్ల పరిధిలో జన సాంద్రత తక్కువగా ఉండటంతో PPP విధానం ద్వారా పెట్టుబడులు రాబట్టడం కష్టమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక(PPR), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ల రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ(DMRCL)కు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ(HMRCL) కు అప్పగించగా.. ఈ మేరకు PPR ను ఢిల్లీ మెట్రో రైలు సంస్ధ సమర్పించింది . రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈక్వల్‌ ఓనర్‌షిప్‌ ప్రాజెక్టుగా రెండవ ఫేజ్ ను చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ లేఖ రాశారు.
మెదటి దశ కింద చేపట్టిన మూడు కారిడార్లకు కొనసాగింపుగా రెండో దశ కింద.. నాలుగో కారిడార్‌ గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకూ 30.7 కిలోమీటర్ల పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఐదో కారిడార్‌లో భాగంగా బీహెచ్‌ ఈఎల్‌ నుంచి మియాపూర్‌ మీదుగా లక్ డీ కాపూల్ వరకూ 26.2 కిలోమీటర్ల మార్గం ఏర్పాటు కానుంది. తొలి దశలోని మూడో కారిడార్‌ (నాగోల్‌ టూ రాయ్‌దుర్గ్‌) విస్తరణలో భాగంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5.1 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. రూ.9,378 కోట్లతో రెండవ దశ ప్రాజెక్టును చేపట్టనుండగా 22 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, 18 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ డిపాజిట్లు, 60 శాతం విదేశీ ఆర్థిక సంస్థల రుణాల ద్వారా నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy