మెడికల్ షాపులపై నిఘా: త్వరలో ఈ-ఫార్మసీ విధానం

chemist_pharma_medicines_healthమెడిసిన్స్ ఎవరికి పడితే వాళ్లకు అమ్మకుండా గట్టి చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఈ- ఫార్మసీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

యాంటిబయోటిక్స్, మత్తు కలిగిన దగ్గుమందు విక్రయాలను డాక్టర్ ప్రిస్కిప్షన్స్ లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు మెడికల్ షాపులో ఫార్మసిస్ట్స్. అవసరమైన వాళ్లకే మందులు చేరడానికి ఈ- పార్మసీ పద్దతిలో ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్స్, మెడికల్ షాపు ఓనర్స్ ని ఆదేశించనుంది కేంద్రం. ఇందుకోసం అన్ని మెడికల్ షాపులు, డిస్టిబ్యూటర్లు ఆన్ లైన్ లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

నకిలీ మెడిసిన్స్ మార్కెట్ విపణిలోకి రాకుండా అడ్డుకోవడానికి వీలవుతుందంటున్నారు అధికారులు. మెడికల్ షాపులపై నిఘా ఉంటుందన్నారు. ప్రస్తుతం అన్ని దుకాణాల్లో ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ విక్రయిస్తున్నారంటున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు.

నగరాలలో యువత మత్తు కలిగిన దగ్గు మందులను కొనుగోళ్లు చేసి.. మోతాదుకు మించి తాగితున్నారు. దాని వల్ల కిక్ వస్తుందంటున్నారు వినియోగదారులు. నిబంధనల ప్రకారం డాక్టర్ చీటీ లేకుండానే మత్తు కలిగిన దగ్గు మందులను, యాంటీబయోటిక్స్‌ మందులను అమ్మకూడదు. కానీ అమ్ముతున్నాయి మెడికల్ షాపులు.

అడ్డగోలుగా మందుల విక్రయానికి చెక్ పెట్టాలంటే షాపులు, డిస్ట్రిబ్యూటర్స్, కంపెనీలపై నిఘా తప్పనిసరి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మందుల విచ్చలవిడి అమ్మకాల నియంత్రణపై దృష్టిపెట్టింది. మెడిసిన్స్ కొనుగోళ్ల వివరాలన్నింటినీ ఇకపై ఆన్‌లైన్‌లో పొందుపర్చేలా సాఫ్ట్ వేర్ ను తీసుకొచ్చింది.

కంపెనీ ఉత్పత్తి నుంచి ఏ వినియోగదారుడికి చేరిందో వివరాలన్నింటినీ పొందుపర్చాలని  కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ నెల 15 లోపు ఈ-ఫార్మసీ విధానంపై ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శికి ఈమెయిల్‌(epharmacy.drugs-mohfw@gov.in) ద్వారా లేదా పోస్టులో గాని తెలియజేయాలని కోరింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy