మెడిటేషన్ తో ప్రయోజనాలెన్నో

ఉదయం లేచింది మొదలు రకరకాల సమస్యలతో మనుషులు ఇబ్బందులు పడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందేందుకు..మెడిటేషన్ ఒక చక్కటి మార్గం.ధ్యానంతో ప్రశాంతమైన మనసును మన సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మెడిటేషన్‌ చేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చుంటే కనుక వీపుని కుర్చీకి ఆనిచ్చి విశ్రాంతి తీసుకున్నట్టు కూర్చోకూడదు. నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చోవడంతో మీరు చురుకుగా ఉంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం సులువు అవుతుంది. కళ్లు తెరిచి లేదా మూసుకుని మెడిటేషన్ చేయొచ్చు. ఒకవేళ మీకు శ్వాస మీద ధ్యాస కళ్లు మూసుకున్నప్పుడే బాగుంటుంది అనుకుంటే అలానే చేయండి. బాగా అలసిపోయి,నిద్ర వస్తున్నట్టు ఉంటే కనుక అరమోడ్పుగా కళ్లను ఉంచాలి. నేలను చూసేంత వరకు కళ్లను తెరిచి ఉంచాలి. చేతులను కాళ్ల మీద ఆన్చి ఉంచాలి. అలాకాకపోతే చేతులను ఎలా ఉంచితే మీకు సౌకర్యంగా ఉంటే అలానే ఉంచొచ్చు. కాళ్లను ఎలా ఉంచాలనేది మీ సౌకర్యాన్ని బట్టి ఉంటుం ది. మెడిటేషన్‌ చేస్తున్నాం , ఆలోచనల్ని అదిమి పెట్టాలి అనే ఆలోచనను తీసేయండి. ఆలోచనలు అటు ఇటు తిరుగుతుంటాయి. వాటి మానాన వాటిని వదిలేయండి. ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు ఏకాగ్రత దానంతటదే వస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy