మెరుపుతీగ : ఈ డాన్స్ చూసి బాలీవుడ్ నోరెళ్లబెట్టింది

Payal-Kadakia-Dance

దిల్ దీవానా.. దిల్ సజనా మానేనా నా.. మైనే ప్యార్ కియాలో ఈ సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. హిందీలోనే కాదు తెలుగులోని అందరినోట పలికిన తొలిపాట ఇదే కావొచ్చు. అదేకాదు ఇటీవల వచ్చిన నాకుచ్ పూచా.. నాకుచ్ మాంగ్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సాంగ్స్ కు ఓ పెళ్లి కూతురు వేసిన స్టెప్స్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. పంజాబ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో స్వయంగా పెళ్లి కూతురు ఈ పాటలకు స్టెప్స్ వేసింది. అమ్మాయి ముఖంలో హావభావాలే ఇప్పుడు హైలెట్ అయ్యాయి. ఎంత అద్బుతం.. రియల్ సాంగ్ అప్పుడు కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదంటూ నెటిజన్లు వీరలెవల్లో పొగడ్తలు వేసేస్తున్నారు. అంతేనా ఈ పెళ్లికూతురు పాయల్ కడకియా పుజ్జి డాన్స్ చూసిన బాలీవుడ్ లోని కొంత మంది నిర్మాత, దర్శకులు అప్పుడే ఎంక్వయిరీ కూడా మొదలుపెట్టారు. ఛాన్స్ ఇస్తే సినిమాల్లో నటిస్తావా అంటూ తెగ ఆఫర్స్ ఇస్తున్నారంట. నిజంగా ఈ పెళ్లికూతురు నృత్యం.. పలికించిన ఎక్స్ స్ప్రెషన్స్ సూపర్బే.. మీరు ఓ లుక్కేయండీ.. జస్ట్ మే7వ తేదీన వీడియో అప్ లోడ్ చేస్తే.. ఇప్పటికే 14లక్షల మంది చూశారు. ఇది అమెరికాలో జరిగిన పెళ్లి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy