మెరుపు వరదలు, భూకంపాలు : జపాన్ లో పరిస్ధితి దారుణం

An emergency crew works at the site after a train derailed due to landslides caused by heavy rain in Karatsu city, Saga prefecture on July 7, 2018. Three people were found dead near rain-swollen rivers in Japan on July 6, officials said, as record downpours prompted authorities to order more than 210,000 people to evacuate their homes, with some areas hit by more than a metre of rainfall. / AFP PHOTO / JIJI PRESS / STR / Japan OUT

An emergency crew works at the site after a train derailed due to landslides caused by heavy rain in Karatsu city, Saga prefecture on July 7, 2018.
Three people were found dead near rain-swollen rivers in Japan on July 6, officials said, as record downpours prompted authorities to order more than 210,000 people to evacuate their homes, with some areas hit by more than a metre of rainfall. / AFP PHOTO / JIJI PRESS / STR / Japan OUT

జపాన్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు జపాన్‌ ప్రధాని షింజో అబే. వరదలు, భూపాతాలు, భూకంపాలు జపాన్ ని వణికిస్తున్నాయి. దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలమవుతుంది. భారీ వర్షాల కారణంగా 46 మంది చనిపోయారు. 50 మంది గల్లంతయ్యారు. 100 సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షం కారణంగా కొన్నిచోట్ల మెరుపు వరదలు వచ్చాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగా అవకాశం ఉన్నట్లు స్ధానిక అధికారులు తెలిపారు. వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదాలు జరిగాయి. వరదల కారణంగా రెస్క్యూ టీమ్‌ల సాయం కోసం పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. హిరోషిమా, ఎహైమ్‌, ఒకయామా, క్యోటో తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ జపాన్‌లోని 32 లక్షల మందిని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం సూచించింది. మెట్రో రైలు పట్టాలు తప్పిన ఫొటో జపాన్ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాలకు తోడుగా శనివారం సాయంత్రం భూ కంపం విరుచుకుపడింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy