మెరుపు వేగమే ప్రమాదానికి కారణమా?

nishith-accidentఏపీ మినిస్టర్ నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రవి రాజావర్మ యాక్సిడెంట్ చూస్తే ఒళ్లు జలదరిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పెద్దమ్మ టెంపుల్ వైపు వెళుతున్న ఈ కారు స్పీడ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కనురెప్పపాటులో వాహనం మాయం అయ్యే విధంగా ఉంది ఆ స్పీడ్. అత్యంత వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్ ను ఢీకొంది. పిల్లర్ ను ఢీకొన్న తర్వాత.. కారు వెనక్కి వచ్చేసింది అంటే ఎంత ఓవర్ స్పీడ్ లో ఢీకొందో అర్థం అవుతుంది. ప్రమాదానికి కారు ఇంజిన్ లోని ఓ పార్ట్ రోడ్డుపై పడింది. ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఇంజిన్ భాగం మొత్తం వెనక్కి వచ్చేయటం చూస్తుంటే.. కారు స్పీడ్ కనీసం 100 నుంచి గరిష్టంగా 150 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత వేగంగా ఈ రోడ్డులో వెళ్లటం వల్లే అదుపుతప్పి యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన కారు స్పీడ్ చూసి షాక్ అయ్యారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో 100కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ గా కారును డ్రైవ్ చేయటం అంటే మాటలు కాదంటున్నారు. ముందు, వెనక, పక్కన వచ్చే వాహనాలకు సైతం చాలా ప్రమాదం అంటున్నారు. కారు పిల్లర్ ను ఢీకొట్టటానికి సెకన్ల ముందే రెండు టూవీలర్స్ వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

నిషిత్ ప్రయాణిస్తున్న కారును చూస్తే అది మెర్సిడెస్ బెంజ్ SUV. అన్ని భద్రతా జాగ్రత్తలు ఉన్నాయి. ఈ కారు విలువ కూడా రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎనిమిది ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. చాలా పవర్ ఫుల్ బ్రేక్ సిస్టమ్, వరల్డ్ క్లాస్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఈ బెంజ్ కారులో ఉన్నాయి. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

One Response to మెరుపు వేగమే ప్రమాదానికి కారణమా?

  1. Harish says:

    Eni safety features unna seat belt petukoka pote use m undadhu

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy