మెస్ చార్జీలు పెంపు…ఎవరికి ఎంతెంత

hostel-messవిద్యార్థుల మెస్ చార్జీలు పెరిగాయి. మెస్ చార్జీలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చార్జీల పెంపుపై సీఎం ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయాన్ని 2017-18 వార్షిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో వెయ్యి 650  హాస్టళ్లు,450 గురుకులాలుఉన్నాయి. వీటి పరిధిలో 3.32 లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్ధులున్నారు. తాజా పెంపుతో వీరందరికీ లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లలో చదివే విద్యార్ధులతో పాటు రోజు వారీగా కాలేజీలు వెళ్లే విద్యార్ధులు అనే నాలుగు కేటగిరీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. వీరిలో డే స్కాలర్ విద్యార్ధులకు ఉపకార వేతనాల రూపంలో, మిగిలిన వారికి సంబంధించి వారి వసతిగృహ సంక్షేమాధికారులకు మెస్ చార్జీల రూపంలో ప్రభుత్వం నిధులిస్తోంది. ప్రభుత్వం తాజా పెంపుతో ఆయా విద్యార్ధులకు మరింత మెరుగైన భోజనం అందించనుంది.

గురుకుల, హాస్టల్ విద్యార్ధుల చార్జీలు

తరగతి        ప్రస్తుతం     పెంపు

3-7            750          950

8-10          850          1,100

ఇంటర్-డిగ్రీ     1,050     1,500

కాలేజీ అటాచ్డ్ హాస్టల్ విద్యార్ధుల చార్జీలు

 తరగతి         ప్రస్తుతం         పెంపు

ఇంటర్          520             750

డిగ్రీ               520              1,000

పీజీ               682            1,500

వృత్తి విద్య      962           1,500

స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్, డేస్కాలర్ విద్యార్ధుల చార్జీలు

తరగతి             ప్రస్తుతం      పెంపు

ఇంటర్              325         500

డిగ్రీ                   325        500

పీజీ                   442       650

వృత్తి విద్య            442    650

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy