మేక‌లను దొంగ‌లిస్తున్న ఆ దొంగ ఎవ‌రు..?

snake 1చైనాలోని ఓ గ్రామంలో నివ‌సించే ప‌శువుల‌కాప‌రి త‌న మేక‌ల మంద‌లోని మేక‌లు రోజురోజుకు త‌గ్గిపోవ‌డాన్ని గ‌మ‌నించాడు. ఎంత‌గా ఆలోచించినా ఆ మేక‌లు ఎలా మిస్ అవుతున్నాయో అంతుచిక్క‌లేదు. ఎవ‌రైనా మేక‌ల‌ను దొంగలిస్తున్న‌డేమోన‌నే అనుమానం అత‌నికి క‌లిగింది. దొంగ‌ను ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని ఓ రాత్రి అంతా జాగారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే దొంగ రానే వ‌చ్చింది. ఆయ‌న అనుమానం నిజ‌మే అయ్యింది. వ‌చ్చిన దొంగ ఎవ‌రో కాదు ఓ 14 అడుగుల భారీ అన‌కొండ‌. చిన్న‌గా వ‌చ్చిన అన‌కొండ ఓ మేక‌ను అమాంతంగా మింగేయ‌డం చూసిన ఆ కాప‌రి షాక్‌కు గుర‌య్యాడు. వెంట‌నే తేరుకుని ఆ దృశ్యాన్ని త‌న కెమెరాలో బంధించాడు. వెంట‌నే ఫారెస్ట్ అధికారుల‌కు పాములు ప‌ట్టే వారికి స‌మాచారం ఇచ్చాడు. వారు వ‌చ్చి ఆ భారీ అన‌కొండ‌ను ప‌ట్టుకుని జూకు త‌ర‌లించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy