మేడమ్‌ టుస్సాడ్స్‌లో ‘మధుబాల’

madubalaఒకప్పటి  బాలీవుడ్‌ నటి మధుబాల మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటుచేయనున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని దేశ రాజధానిలో డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు. అయితే మధుబాల ఇప్పుడు లేకపోవడంతో ఆమె నటించిన ‘మొఘల్‌ ఎ ఆజామ్‌’ చిత్రంలోని అనార్కలి పాత్రను మైనపు విగ్రహంలా రూపొందించనున్నారు.

ఈ విషయాన్ని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. కోట్లాది మంది భారతీయుల మనసు గెలిచిన మధుబాల మైనపు విగ్రహం రూపొందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 1952లో ఓ ప్రముఖ అమెరికన్‌ మ్యాగజీన్‌ మధుబాల ఫొటోను ప్రచురించడంతో అంతర్జాతీయంగానూ మధుబాల పేరు మారుమోగిపోయింది. ‘చల్తీ కా నామ్‌గాడీ’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’ వంటి గొప్ప సినిమాల్లో నటించిన మధుబాలా 1969లో కన్నుమూశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy