మేడారం అభివృద్ధికి రూ.200 కోట్లు : కేసీఆర్

KCR MEDARAMమేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తించాలన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ శుక్రవారం (ఫిబ్రవరి-2) కుటుంబసమేతంగా వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

పోయినసారి ఆరోగ్యంబాగాలేక మేడారం జాతరు రాలేకపోయానని తెలిపిన సీఎం..సమ్మక్క సారక్క దర్శణం సంతోషాన్నిచ్చిందన్నారు. రాబోయే జాతరను కనీవినీఎరుగని రీతిలో జరుపుతామన్నారు. గద్దెల దగ్గర స్థలాన్ని మరింత విస్తరిస్తామని,  శాశ్వత ఏర్పాట్ల కింద ప్రభుత్వం తరుపున రూ .రెండు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం. ఈ బడ్జెట్ లోనే ఈ నిధులను వచ్చేలా చూస్తామన్న కేసీఆర్..మేడారంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని నిర్మాణాలు చేపడుతామన్నారు.

మేడారంలో ఇంకా కనీసం వంద ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. సమైక్యరాష్ట్రంలో మేడారం జాతరకు సరైన గుర్తింపు రాలేదని, ఆ తల్లిదయవల్ల ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి తనకు అదృష్టం కలిగిందన్నారు. భక్తుల స్నానాల కోసం ప్రత్యక డ్యామ్ నిర్మిస్తామన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy