మేడారం జాతరకు హెలికాప్టర్లు

chopper

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని సౌకర్యాలు చేపట్టారు అధికారులు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు… ఈ ఏడాది జాతరకు హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు సమ్మక్క సారలమ్మలను విహంగ వీక్షణం చేయవచ్చన్నట్లు.

హెలికాప్టర్ లో హన్మకొండ నుంచి మేడారానికి రావాలంటే రూ.12,999 చార్జీగా నిర్ణయించారు. రెండేళ్లలోపు పిల్లలకు ఉచితం. జాతరలో హెలికాప్టర్ రైడ్ కు కూడా అవకాశం కల్పిస్తున్నారు. జాతరను విహంగ వీక్షణం ద్వారా చూడవచ్చు. ఇందుకోసం ఆయా పరిసరాల్లో 10 నిమిషాలు గగన విహారానికి 2వేల499 రూపాయల చార్జీగా నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి 4వ తేదీ వరకు హెలికాప్టర్ సవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణానికి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు అధికారులు. www.medaramjatara.com వైబ్ సైట్ లో ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. జాతర సమయంలో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారానికి తుంబి ఏవియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్లు తిప్పుతున్నారు. రద్దీని బట్టి ట్రిప్పులు పెంచే అవకాశముంది. హన్మకొండ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ల దగ్గరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం గద్దెల దగ్గరకు తీసుకోళ్తారు. వారికి గంటలో అమ్మల దర్శనం చేయిస్తారు. తర్వాత తిరిగి హన్మకొండకు చేరుస్తారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ఈ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy