మేడారం జాతరలో ఛత్తీస్ గడ్ సీఎం

RAMN SINGమేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.. ఛత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్. గురువారం (ఫిబ్రవరి-1) ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్న రమణ్ సింగ్ కు.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన రమణ్ సింగ్.. గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

మహాజాతర రెండో రోజైన గురువారంనాడు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు.  సీఎం రమణ్ సింగ్ ఆ సమయంలోనే సమ్మక్క గద్దెపైకి వచ్చారు. దీంతో భక్తులు క్యూలైన్లో వస్తూ కొబ్బరి కాయలు విసురుతుండటంతో ముఖ్యమంత్రి దర్శనానికి కాస్త ఆలస్యమైంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy