మేడారం జాతర : ఏయే మొక్కులు.. ఎలా చెల్లిస్తారు

Special-Report-On-Tribal-Rituals-At-Sammakka-Saralammaమేడారం జాతరలో అమ్మలకు భక్తులు రకరకాల మొక్కులు చెల్లించుకుంటారు. తమ జీవితాలు బాగుండాలని, కష్టాలు పోవాలని కోరుకుంటారు. మొదట్లో అడవిని చల్లగా చూడాలని ఆదివాసీలు మొక్కులు తీర్చేవారు. జీవనవిధానంలో మార్పులు వచ్చాక కుటుంబాల గురించి కోరుకుంటున్నారు.

ఆదివాసీల మొక్కుబడులు చాలా రకాలుగా ఉంటాయి. డబ్బున్నవారు పెద్ద మొక్కులు చెల్లిస్తారు. లేనివారు శక్తి కొద్ది చెల్లిస్తారు. మొక్కుల్లో ప్రధానమైంది అమ్మలకు బంగారం సమర్పించుకోవడం. తులాభారం వేసి బెల్లాన్ని బంగారంగా భక్తులు సమర్పిస్తారు. వడిబాల బియ్యం, తట్టెలు, కొబ్బరికాయలు, పసుపుకుంకుమలు, చీర, బుట్టలు, పట్నాలు, చిలకలు, బోనాలు, ఎదురుకోళ్లు, యాటపోతులు ఇలా పలు రకాల మొక్కులు చెల్లించుకుంటారు. బాధలు పోగొట్టినందుకు, పిల్లలు పుట్టినందుకు, ఉద్యోగం దొరికినందుకు భక్తులు మొక్కులు తీరుస్తారు. ఒకప్పుడు ఆదివాసీలకు బెల్లం ఖరీదైన వస్తువు కాబట్టి దీన్నే దేవతలకు సమర్పించేవారని చెబుతారు. అలాగే సమ్మక్క భర్త పగిడిద్దరాజు పేరులో పగిడి అంటే బంగారం అని అర్థం ఉంది. అందుకే బెల్లానికి బంగారం అని పేరొచ్చిందని మరికొందరు చెబుతారు.

భక్తుల ఎదురుకోళ్లు

భక్తుల మొక్కుల్లో ఎదురుకోళ్లు కూడా ఒకటి. భక్తులు ఆసక్తి చూపించే కార్యక్రమం కూడా ఇదే. సమ్మక్క, సారలమ్మ గద్దెల ముందు భాగంలో కోళ్లను పైగి ఎగరేస్తారు. తమ బాధలు తీరితే ఎదురుకోళ్లు చేస్తామని భక్తులు మొక్కుకుంటారు. మంచి జరిగిందని భావించినవారు ఎదురుకోళ్లు చేస్తారు. కోళ్లను పైకి ఎగరేసేవారికి రూపాయి ఇస్తే గద్దెల దగ్గర ఎదురుకోళ్లు చేసి అమ్మవారికి మొక్కు చెల్లిస్తారు. మేడారం జాతర సందర్భంగా పెళ్లి చేసుకొని అక్కడే మూడురోజులు నిద్ర చేస్తామని భక్తులు మొక్కుకుంటారు. అలా మూడురోజులు ఉండి మొక్కు తీర్చుకుంటారు. దీంతో తమకు సమ్మక్క, సారలమ్మ, జంపన్న లాంటి పిల్లలు పుడతారని తరాలుగా కొనసాగుతున్న నమ్మకం. ఆదివాసీల ఈ మొక్కులను ఇప్పుడు మైదాన ప్రాంతాలవాళ్లు కూడా పాటిస్తున్నారు.

అమ్మలకు ఒడిబాల బియ్యం

ఒడిబాల బియ్యాన్ని కూడా మొక్కుగా అమ్మలకు సమర్పిస్తారు భక్తులు. కొత్తగా పెళ్లైనవారుగానీ, వారి తల్లిదండ్రులుగానీ ఈ మొక్కు చెల్లిస్తారు. బియ్యంలో పసుపు కలిపి నడుంకు కట్టుకుంటారు. జాతరకు వచ్చి గద్దెల దగ్గర డబ్బాల్లో ఒడిబియ్యం పోసి మొక్కు చెల్లిస్తారు. ఇలా చేస్తే అమ్మ కాపాడుతుందని, కష్టాలు తీరతాయని భక్తులు నమ్ముతారు. పిల్లలు పుట్టినవారు గద్దెల దగ్గర ఉన్న స్తంభానికి వెండి తొట్టెల కట్టి మొక్కు చెల్లిస్తారు. అమ్మలు వస్తున్నప్పుడు వడ్డెల కాళ్ల కింద పడితే జన్మసార్థకం అయిందని భక్తులు భావిస్తారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy